కొల్లాపూర్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సోమశిలలో కృష్ణా నది బ్యాక్ వాటర్ తగ్గడంతో సప్త నదుల సంగమేశ్వరాలయం బయటపడింది. దాదాపు 9 నెలలు కృష్ణమ్మ నీటిలో మునిగిపోతుంది. మూడు నెలలు పాటు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలయ అర్చకుడు తెల్కపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో సంగమేశ్వర ఆలయాన్ని అర్చకులు, భక్తులు శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
